మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డి చెరువులో కాలేజీలు కట్టారు: సీపీఐ నారాయణ

మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డి చెరువులో కాలేజీలు కట్టారు: సీపీఐ నారాయణ

హైదరాబాద్: మాజీ మంత్రి మల్లారెడ్డి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి చెరువును ఆక్రమించి కాలేజీలే కట్టారని అన్నారు సీపీఐ నేత నారాయణ. ఆదివారం (ఆగస్టు 25, 2024) సినీనటుడు నాగార్జున కు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలను పరిశీలించిన నారాయణ.నాగార్జున సత్య హరిశ్చంద్రుడేమీ కాదు..చెరువును ఆక్రమించిన Nకన్వెన్షన్ కట్టారన్నారు. ఎన్ కన్వెన్షన్ లో రోజు లక్ష రూపాయల ఆదాయం వస్తుందన్నారు. అక్రమ నిర్మాణాలపై సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగ తిస్తున్నామన్నారు. 

మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి చెరువులో కాలేజీలు కట్టారు..వారంతా కబ్జాకోరులు..ఫిరంగి నాళాలను కబ్జాచేసి ఇల్లు కట్టుకున్నారన్నారు. చెరువులు, నాళాలు కబ్జా అయితే ఊర్లు మునిగిపోతాయి. అక్రమ నిర్మాణాల కూల్చివేతను కొనసాగిస్తూ ఎక్కడ కబ్జా జరిగినా ఖాళీ చేయించాలన్నారు నారాయణ. 

ALSO READ | పల్లా అక్రమనిర్మాణాలపై హైడ్రా ఫోకస్..

ఎవరు కబ్జాలు చేసినా..దొంగ పట్టాలు పొందినా వారి ఆస్తులు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సీపీఐ నారాయణ అన్నారు. రాజకీయ కక్ష సాధింపు అవసరం లే దు..ఏపార్టీకి చెందిన అయినా ఆక్రమణలు చేస్తే..హైడ్రా కూల్చివేతలు చేపట్టాలన్నారు. అటువంటి నిర్మాణాలను అనుమతులు ఇచ్చిన అధికారులపై కూడా చర్య లు తీసుకోవాలన్నారు. 

జ్యాంగం, న్యాయం అందరికీ సమానమే.. ఏళ్ల తరబడి కేసులు నాన్చవద్దు..ఆక్రమణదారులు కోర్టుకు వెళితే తప్పు చేసినట్టే లెక్క అని సీపీఐ నేత నారాయణ అన్నారు.