
సినీనటులపై బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్ కేసు నమోదు కావడంపై సీపీఐ నారాయణ స్పందించారు. కళామతల్లి ఇచ్చిన గుర్తింపును ఆర్టిస్ట్ లు తప్పుడు పనులకు దుర్వినియోగం చేస్తున్నారని మండి పడ్డారు. సినీ నటులను ప్రజలు అనుసరిస్తారంటూ... వారు చేతినిండా సంపాదిస్తున్నారని.. . సినిమాలు కాకపోతే OTT సహా ఎన్నో రకాలుగా అవకాశాలు ఉన్నా.. ఈ పాడు పనితో ఎందుకు సంపాదిస్తున్నారని ప్రశ్నించారు.
గతంలో చిరంజీవి కోకో కోలా కంపెనీ యాడ్ ఇచ్చినప్పుడు .. ఓవైపు రక్తదానం చేస్తూ... మరోవైపు రక్తాన్ని దెబ్బతీసే డ్రింక్ లను ఎలా ప్రమోట్ చేస్తారని ప్రశ్నిస్తూ లేఖ రాయడంతో ఆ కంపెనీతో ఒప్పంద గడువు ముగిసిన తరువాత మళ్లీ చేయనని చిరంజీవి చెప్పారని.. సీపీఐ నారాయణ అన్నారు. గుట్కా విషయంలో ఒక పనికిమాలిన తీర్పు రావడంతో .. దాన్ని ఆసరా చేసుకుని... పాన్ పరాగ్.. పేరుతో కొంతమంది అనైతిక వ్యాపారం చేస్తున్నారని సీపీఐ నారాయణ విమర్శించారు.