ఆలోచించండి.. మావోస్టులకు CPI నారాయణ కీలక సూచన

ఆలోచించండి.. మావోస్టులకు CPI నారాయణ కీలక సూచన

న్యూఢిల్లీ: దేశంలో రేప్‎లు, మర్డర్లు జరుగుతున్నాయని.. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా వాటిపై ఫోకస్ పెట్టాలని సీపీఐ సీనియర్ నేత నారాయణ అన్నారు. నక్సలిజంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమావేశం నిర్వహించడంపై ఆయన కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. రేప్‎లు చేసేవారికి బెయిల్ ఇస్తున్నారని.. ఘోరాతి ఘోరాలు చేసిన డేరా బాబాకు హర్యానా ఎన్నికల సమయంలో బెయిల్ ఇచ్చారని విమర్శించారు. కానీ ప్రజా ఉద్యమంలో ఉన్న వరవరరావుకు మాత్రం బెయిల్ రాదని అన్నారు. మారిన పరిస్థితులకు తగ్గట్టు ఉద్యమాల్లో మార్పులు తెచ్చుకోవాలని, అన్నలు ఆలోచించి ప్రజలతో కలిసి పోరాడాలని తెలిపారు. 

ALSO READ | హింసతో ఏదీ సాధించలేం: కేంద్ర హోం మంత్రి అమిత్ షా

ప్రధాని మోడీ ఇజ్రాయెల్ మోడల్‎ను అమలు చేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు జమ్ముకాశ్మీర్‎లో దొడ్డి దారిన ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు మొదలు పెట్టిందని తెలిపారు. అందుకు ఐదుగురు ఎమ్మెల్యేలను ముందే నామినేట్ చేశారన్నారు. ప్రజల మద్దతు ఉంటే బీజేపీ ఇలా ఎందుకు చేస్తుందని ప్రశ్నించారు. ప్రధాని మోదీ విదేశీ పర్యటనలన్నీ నిష్ర్పయోజనమన్నారు. బీహార్‎లో వరదలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, మణిపూర్ రావణ కాష్టంలా మండుతున్నా ప్రధాని పర్యటించరని విమర్శించారు. నేపాల్ ప్రభుత్వంతో మాట్లాడి ఇలాంటి విపత్తులు రాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.