- సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి
హైదరాబాద్, వెలుగు: సీపీఐ ఆవిర్భవించిన వందేండ్లలో అంతరాలు లేని సమాజమే లక్ష్యంగా సమరశీల పోరాటాలు నిర్వహించిందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి పేర్కొన్నారు. సీపీఐ శతాబ్ది ఉత్సవాల ప్రారంభం సందర్భంగా ఈ నెల 30న నల్లగొండ జిల్లా కేంద్రంలోని నాగార్జున కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. శనివారం హైదరాబాద్ హిమాయత్ నగర్ సీపీఐ రాష్ట్ర కార్యాలయం మగ్దూంభవన్ లో మీడియా సమావేశం జరిగింది.
తొలుత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ప్రముఖ సినీ దర్శకులు శ్యామ్ బెనగల మృతికి సంతాపం తెలిపారు. తర్వాత చాడ మాట్లాడుతూ.. శతాబ్ది ఉత్సవాల స్ఫూర్తితో ప్రజలకు మరింత చేరువయ్యేలా తెలంగాణలోని ప్రతి పల్లెకు, గడపకూ పునరంకితం కానున్నట్లు పేర్కొన్నారు. శతాబ్ద కాలంలో ఒడిదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ ధైర్యంతో నేటికి పేదల అభ్యున్నతే లక్షంగా సాగుతున్నామన్నారు. పార్టీ నేతలు సయ్యద్ అజీజ్ పాషా, పల్లా వెంకటరెడ్డి మాట్లాడుతూ దేశంలో కమ్యూనిస్టు పార్టీలు బలహీనం పడ్డోచ్చు కాని కమ్యూనిజం బలహీన పడలేదన్నారు.