గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తిచేయించాలి :  మంత్రి ఉత్తమ్​ను కోరిన  చాడ వెంకటరెడ్డి

గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తిచేయించాలి :  మంత్రి ఉత్తమ్​ను కోరిన  చాడ వెంకటరెడ్డి

హుస్నాబాద్, వెలుగు: గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తిచేసేందుకు రూ.వెయ్యి కోట్లు మంజూరుచేయించాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి ఇరిగేషన్​ మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డిని కోరారు. ఈమేరకు ఆయన శనివారం మంత్రికి వినతిపత్రాన్ని ఇచ్చారు. అనంతరం ఆయన మట్లాడుతూ.. 2007లో అప్పటి సీఎం వైఎస్ జలయజ్ఞం కార్యక్రమంలో భాగంగా వరద కాలువకు ఇందిరమ్మ కాలువగా నామకరణం చేశారన్నారు.

అందులో భాగంగా గౌరవెల్లి, గండిపెల్లి, తోటపల్లి లిఫ్టు కెనాల్ కు తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో  వైఎస్ శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం భూసేకరణ చేసి, తోటపల్లి రిజర్వాయర్​ను  రద్దుచేసిందన్నారు. లిఫ్టు కెనాల్ పనులు 90 శాతం పూర్తి కాగా, మిగతా ఫెన్సింగ్ పనులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. కేసీఆర్​ గౌరవెల్లి ప్రాజెక్టు సామర్థ్యం పెంచడంతో 80 శాతం పనులే పూర్తయ్యాయన్నారు. నిర్వాసితులకు కూడా పూర్తిస్థాయిలో పరిహారాలు అందలేదన్నారు.