
- కాంగ్రెస్ నేతలను కోరిన సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా
వరంగల్, వెలుగు : వరంగల్ పార్లమెంట్ ఎస్సీ స్థానాన్ని పొత్తులో భాగంగా సీపీఐకే కేటాయించాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కోరినట్లు రాష్ట్ర సీపీఐ నేతలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర , జిల్లా నేతలు ఢిల్లీ వెళ్లి శుక్రవారం రాజాను కలిశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఇండియా కూటమిలో పొత్తులో భాగంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఒక్కో స్థానాన్ని ఇవ్వాలని అడిగినట్లు చెప్పారు.
సీపీఐ దివంగత నేత భగవాన్‍దాస్ కుమారుడు, సీనియర్ జర్నలిస్టు బీఆర్ లెనిన్ వరంగల్‌లో పోటీకి సిద్ధమైనట్లు తెలిపారు. రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‍రెడ్డి, జిల్లాకు చెందిన నేతలు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, విజయ సారథితో కలిసి అభ్యర్థిగా లెనిన్ ఢిల్లీ వెళ్లి పార్టీ కార్యాలయంలో జాతీయ నేతలు రాజా, సెంట్రల్ సెక్రటేరియట్ మెంబర్ రామకృష్ణ పాండ్యాను కలిశారు.