హైదరాబాద్: బీఆర్ఎస్చేసిన పాపాల వల్లే బీజేపీ గ్రాఫ్పెరుగుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయా ల్సింది గులాబీపార్టీపై కాదని, బీజేపీపై చేయాలని సూచించారు. లేకుంటే కాషాయపార్టీ కాంగ్రెస్ను మింగేసే ప్రమాదముందన్నారు. హైదరాబాద్ లో ఆయన మీడియా తో మాట్లాడుతూ ‘బీజేపీ నీచ రాజకీయాలు చేస్తోంది.
ప్రశ్నిస్తే జైళ్లో పెడుతోంది. బీజేపీపై పోరాటం విషయంలో కాంగ్రెస్తమిళనాడు సీఎం స్టాలిన్ను ఆదర్శంగా తీసుకోవాలి. ప్రభుత్వం సన్న వడ్లకే బోనస్ ఇస్తామనడం సరైంది కాదు. ఎమ్మెల్సీ బై ఎలక్షన్లో సీపీఐ మద్దతు కాంగ్రెస్ అభ్యర్థికే ఉంటుంది’ అని నారాయణ స్పష్టం చేశారు. బెంగళూరులో రేవ్ పార్టీపై రకరకాల కథనాలు వస్తున్నాయని, అసలు ఆ రేవ్ పార్టీకి డ్రగ్స్ ఎలా వచ్చాయో కనుక్కోవాలన్నారు. రేవ్ పార్టీకి సంబంధం లేని వాళ్లను బజారుకీడ్చటం సరైంది కాదని అన్నారు.