కేజ్రీవాల్ని చూసి మోదీ భయపడుతుండు :సీపీఐ నారాయణ

 

  • రాజ్యాంగంపై బుల్ డోజర్లతో దాడి చేస్తరు
  • బీజేపీ హయాంలో హోల్ సేల్ అవినీతి
  • సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

హైదరాబాద్​: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను చూసి పీఎం మోదీ భయపడుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఇవాళ మీడియాతో ఆయన మాట్లాడుతూ శిఖండి మాదిరిగా మహిళను ఉపయోగించి కేజ్రీని బ్లేమ్ చేయాలని చూస్తున్నారన్నారు. తనను వ్యతిరేకించే వారిపై కక్షపూరితంగా, అప్రజాస్వామికంగా మోదీ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.  నడమంత్రపు స్వర్గాన్ని సృష్టించి తనకు 400 సీట్లు వస్తాయని అంటున్నారని ఎద్దేవా చేశారు.

మోదీ రాజ్యాంగంపై బుల్ డోజర్లతో దాడి చేస్తారని చెప్పారు. దేవాలయాలపై కాంగ్రెస్ పార్టీ దాడులు చేస్తుందని మోదీ అంటున్నారని, దీనిపై ఈసీ మెతక వైఖరి పనికిరాదన్నారు.  దేశమంతా ఎన్నికల ప్రచారం చేసి చివరలో తన నియోజకవర్గంలో ప్రచారం చేసుకునేలా ఎన్నికల తేదీలు ఖరారయ్యాయని ఆరోపించారు.  సౌత్​లో బీజేపీ  ఎక్కడ ఉందని, ఎక్కడి నుంచి ఈ సీట్లు వస్తాయని ప్రశ్నించారు. మోదీని గద్దె దించాలన్న ఒక వేవ్ దేశవ్యాప్తంగా ఉందన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను బెదిరించి అదానీకి రుణాలు ఇప్పించారన్నారు.

ఈ ప్రభుత్వ హయాంలో హోల్ సేల్ అవినీతి జరిగిందని ఆరోపించారు. మోడీ గ్యారంటీ అంటే ఆర్ఎస్ఎస్ కూడా తిరగబడిందని ఆయన అన్నారు. హైదరాబాద్ లో ఎంఐఎం కోసం బీజేపీ వాళ్లు కూడా పనిచేశారని తెలిపారు. బీఆర్ఎస్ పరోక్షంగా బీజేపీకి అవకాశం కల్పించిందన్నారు. ఏపీలో  సీఎంను నిర్ణయించేది మోదీయేనని అన్నారు. ఏపీలో హింస జరుగుతుంటే సీఎం, ప్రతిపక్ష నాయకుడు విదేశాలు తిరుగుతున్నారని ఎద్దేవా చేవారు.