యాదాద్రి భువనగిరి జిల్లా: మునుగోడులో పెద్ద శత్రువును ఓడించడానికి చిన్న శత్రువును బలపరుస్తున్నామని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కు మద్దతు ఇస్తున్నట్లు సీపీఐ ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీని ఓడించేందుకు ఎవరికైనా మద్దతు ఇస్తామని, అయితే బీజేపీని ఓడించే సామర్థ్యం టీఆర్ఎస్ కే ఉందని ఆయన చెప్పారు.
కేసీఆర్ తో రాజకీయంగా భేదాభిప్రాయాలు ఉన్నాయని, మునుగోడులో మద్దతు ఇచ్చినంత మాత్రాన కేసీఆర్ పై తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఉచిత పథకాలు తీసేయాలని కేంద్ర ప్రభుత్వం అనడం సరికాదన్నారు. ప్రైవేటికరణ పేరుతో రిజర్వేషన్లు లేకుండా చేస్తున్నారని ప్రధాని మోడీపై మండిపడ్డారు. రైతు బంధును ఐదు ఎకరాల లోపు ఉన్నవాళ్లకు మాత్రమే ఇవ్వాలన్న ఆయన... దళిత బంధు పథకంతో ఎంతమంది లబ్ది పొందారో చెప్పాలని డిమాండ్ చేశారు.