కాశీబుగ్గ, వెలుగు : పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని బుధవారం వరంగల్ పోచమ్మమైదాన్ సెంటర్లో సీపీఐ పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి మేకల రవి మాట్లాడుతూ దేశంలో
పెంచిన నిత్యావసర వస్తువులు ధరలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులున్నారు.