ట్రంప్ తీరుతో యువత జీవితం డిస్టర్బ్ అవుతుంది: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

ట్రంప్ తీరుతో యువత జీవితం డిస్టర్బ్ అవుతుంది: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

అక్రమ వలసదారుల పట్ల అమెరికా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఖండించారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. అమెరికా ప్రభుత్వ తీరుతో యువత జీవితం డిస్టర్బ్ అవుతోందని అన్నారు. అక్రమ వలసదారుల పేరుతో యువతను అమెరికా ప్రభుత్వం క్రూరమైన పద్ధతుల్లో జంతువులను, నేరస్తులను వేటాడుతున్న తీరులో ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ ప్రభుత్వం వలస దారులను తిప్పి పంపే పేరుతో చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నదని పేర్కొన్నారు. ఈ మేరకు అమెరికా పార్లమెంటు ముందు నుంచి ఆదివారం ( ఫిబ్రవరి 23, 2025 ) ఉదయం ఒక వీడియో విడుదల చేశారు.

ట్రంప్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కక్షగట్టినట్టు వలస దారులను జంతువుల తరహాలో వేటాడడాన్ని ఆక్షేపించారు.అక్రమ వలస దారులను తిప్పి పంపడాన్ని తాము వెతిరేకించడం లేదని పేర్కొన్నారు. భారత ప్రభుత్వం కూడా అమెరికాలో ఉన్న భారతీయ వలస దారులను వెనక్కు తీసుకుంటామని ప్రకటన చేసిందని గుర్తు చేశారు. అయితే ట్రంప్ ప్రభుత్వము వలస దారులని తిప్పి పంపడానికి ఎన్నుకున్న విధానాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నామని అన్నారు. 

భారత ప్రధాని మోదీ అమెరికాకు వచ్చి ట్రంప్ తో చర్చలు జరిపిన మరుసటి రోజు నుంచి కూడా అదే రీతిలో జంతువులను వేటాడినట్టు వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండించారు.ఆమెరికలో ఉన్న వలస దారులు ఉన్నట్టుండి వచ్చిన వారు కాదని పేర్కొన్నారు. దశాబ్దకాలంగా అక్కడ ఉంటున్నారని తెలిపారు. వారిని వారి దేశాలకు పంపడానికి చేస్తున్న చర్యలు అభ్యన్తరకరంగా ఉన్నాయన్నారు. 

అమెరికా ప్రభుత్వ తీరు యువత జీవితం డిస్టర్బ్ అవుతున్నదని పేర్కొన్నారు.వలస దారులను గుర్తించడం వారికి కొంత సమయం ఇచ్చి సుహృద్భావ వాతావరణంలో తిప్పి పంపే ఏర్పాటు చేసి ఉండాల్సిందని పేర్కొన్నారు. అలా కాకుండా యువతను వేధించి వెంటాడుతున్న తీరును ఖండిస్తున్నామని పేర్కొన్నారు.