కమ్యూనిస్టు పార్టీది పోరాట చరిత్ర

కమ్యూనిస్టు పార్టీది పోరాట చరిత్ర

మంచిర్యాల/బెల్లంపల్లి, వెలుగు: కమ్యూనిస్టు పార్టీది త్యాగాలు, పోరాటాల చరిత్ర అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేన శంకర్​అన్నారు. సీపీఐ 100వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం పార్టీ మంచిర్యాల జిల్లా ఆఫీసు వద్ద జెండా ఆవిష్కరించి కేక్​కట్​ చేశారు. బడుగు బలహీన వర్గాల కోసం పోరాడేది కమ్యూనిస్టు పార్టీ మాత్రమేన న్నారు. ఈ నెల 30న నల్లగొండ జిల్లాలో జరిగే బహిరంగ సభను సక్సెస్ ​చేయాలని కోరారు. జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, టౌన్​ 

సెక్రటరీ ఖలీందర్ అలీఖాన్, నాయకులు పాల్గొన్నారు. బెల్లంపల్లి పట్టణ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర సమితి సభ్యురాలు బొల్లం పూర్ణిమ జెండా ఎగురవేశారు. సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు మిట్టపల్లి వెంకటస్వామి, జిల్లా సీనియర్ కార్యవర్గ సభ్యుడు చిప్ప నరసయ్యలు మాట్లాడారు. స్వాతంత్ర్యం రాక ముందే సీపీఐ పార్టీ ఆవిర్భవించి ప్రజా సమస్యల కోసం అలుపెరగని పోరాటాలు చేస్తుందన్నారు. సీపీఐ టౌన్ సెక్రటరీ ఆడెపు రాజమౌళి, జిల్లా కౌన్సిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.