భద్రాచలం,వెలుగు : తెలంగాణ ద్రోహి కేసీఆర్ అని సీపీఐ రాష్ట్రకార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. భద్రాచలం సీపీఐ డివిజన్ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... నెల రోజుల కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలను నేటికీ నెరవేర్చలేదంటూ బీఆర్ఎస్ లీడర్లు వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.
శ్వేతపత్రంను ప్రభుత్వం విడుదల చేస్తే స్వేదపత్రం అంటూ రివర్స్ డ్రామా ఆడటం బీఆర్ఎస్కే చెల్లిందని ధ్వజమెత్తారు. ప్రగతిభవన్ ఇనుప సంకెళ్లు తొలగించి ప్రజాపాలన అందిస్తూ ఎలాంటి భేషజాలకు పోకుండా సీఎం రేవంత్రెడ్డి ముందుకు పోతున్నారన్నారు. దీన్ని బీఆర్ఎస్ నేత కేటీఆర్ జీర్ణించుకోలేక పోతున్నారని, అందుకే ఆత్రుతలో తప్పులు మీద తప్పులు చేస్తున్నారన్నారు
కార్మికులకు అండగా ఉంటా
పాల్వంచ: కార్మికులకు అన్ని రకాలుగా అండగా ఉంటానని కొత్తగూడెం ఎమ్మె ల్యే కూనంనేని సాంబశివరావు అన్నా రు. సోమవారం పాల్వంచలోని దమ్మపేట సెంటర్లో గల ఏఐటీ యూసీ అనుబంధ బిల్డింగ్ వ ర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కొత్త సంవత్సరం క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు ముత్యాల విశ్వనాథం, నరాటి ప్రసాద్, వీసంశెట్టి పూర్ణ, బండి నాగేశ్వర రావు, ఉప్పు శె ట్టి రాహుల్, దుగ్గిరాల సుధాకర్, గుండాల నాగరాజు, అన్నా రపు వెంక టేశ్వర్లు, శ్రీనివాస్, ఇట్టి వెంకట్రావు,గిరి,జకరయ్య, పాషా పాల్గొన్నారు.