సెప్టెంబర్ 17న ఎగ్జిబిషన్ గ్రౌండ్​లో సీపీఐ సభ

  • నేడు ఎగ్జిబిషన్ గ్రౌండ్​లో సీపీఐ సభ
  • అటెండ్ కానున్న సీపీఐ జనరల్ సెక్రటరీ డి.రాజా 

హైదరాబాద్, వెలుగు : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సందర్భంగా ఆదివారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్​లో  సీపీఐ భారీ సభ నిర్వహించనుంది. ఈ మేరకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రకటించారు. ఈ నెల11 నుంచి ఉత్సవాలు ప్రారంభించామని, ప్రతి జిల్లాలో  పోరాట చిహ్నాలు, స్మారక స్థూపాల వద్ద సభలు, నాటి సాయుధ పోరాట ఇతివృత్తంతో ఆట, పాటల ప్రదర్శనలు జరిగాయని తెలిపారు.

ALSO READ: బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోస్టర్ల వార్

ఆదివారం ఎగ్జిబిషన్ గ్రౌండ్​లో జరిగే సభకు సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, సీపీఐ జాతీయ కార్యదర్శులు నారాయణ, అజీజ్ పాషా అటెండ్ అవుతారని వెల్లడించారు. వీరితోపాటు కవి గోరటి వెంకన్న, వందేమాతరం శ్రీనివాస్, సుద్దాల అశోక్ తేజ, జయరాజ్ పాల్గొంటారని వివరించారు. విలీన దినోత్సవం సందర్భంగా సీపీఐ స్టేట్​ ఆఫీసులో ఆదివారం జాతీయ జెండాను ఎగురవేయనున్నారు.