- సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించి, హిందు, ముస్లింల ఐక్యతను దెబ్బ తీసేందుకు బీజేపీ కుట్రలు చేస్తుందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి విమర్శించారు.
శనివారం హైదరాబాద్ సీపీఐ రాష్ట్ర కార్యాలయం మగ్దూం భవన్ లో కామ్రేడ్ రావి నారాయణ రెడ్డి 34వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన సాయుధ పోరాటంలో రావి నారాయణ రెడ్డి కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.