విమాన టికెట్ ధరలు నియంత్రిచండి :కె. నారాయణ

విమాన టికెట్ ధరలు నియంత్రిచండి :కె. నారాయణ
  • సివిల్ ఏవియేషన్ మినిస్టర్​కు సీపీఐ నేత నారాయణ లేఖ

న్యూఢిల్లీ, వెలుగు: విమాన టికెట్ ధరలు నియంత్రించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కింజారపు రామ్మోహన్ నాయుడుకు లేఖ రాశారు. అనంతరం ఢిల్లీ తెలంగాణ భవన్​లో మీడియాతో మాట్లాడారు. విమానయాన సంస్థలు ప్రయాణికులను దోచుకుంటున్నాయ ని ఫైర్ అయ్యారు. ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పిస్తే ప్రైవేట్ విమానయాన సంస్థలు ఇష్టానుసారంగా టికెట్ ధరలు పెంచుతున్నాయని విమర్శించారు. ప్రస్తుతం కార్పొరేట్లు, ధనవంతులు మాత్రమే కాకుండా సామాన్య, మధ్య తరగతి ప్రజలు సైతం విమానాల్లో ట్రావెల్ చేస్తున్నారని తెలిపారు.