చుట్టూ నీటి వనరులున్నా పట్టణ ప్రజలకు తాగునీరు ఇవ్వడంలో మున్సిపల్ శాఖ విఫలమవుతోందని సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి సాబీర్ పాష ధ్వజమెత్తారు. తమకు తాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ బుధవారం మహిళలు ర్యాలీగా మున్సిపల్ ఆఫీస్కు వచ్చి అక్కడే భైఠాయించి నిరసన తెలిపారు.
పారిశ్రామికంగా అభివృద్ధి సాధిస్తున్న పట్టణంలో కిన్నెరసాని, గోదావరి, మొర్రేడు వంటి నదలున్నా తమకు ఆఫీసర్లు తాగునీరు అందించలేకపోతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా స్పందించకుంటే ఆఫీస్ కు తాళం వేసి నిర్బంధిస్తామని హెచ్చరించారు. - పాల్వంచ, వెలుగు