వీడియో: ఈ కష్టం పగోడికి కూడా రావద్దు.. నవ్వులు పంచిన విండీస్ బాహుబలి

వీడియో: ఈ కష్టం పగోడికి కూడా రావద్దు.. నవ్వులు పంచిన విండీస్ బాహుబలి

క్రికెట్‌లో బ్యాటర్లు రనౌట్ గా వెనుదిరగడమన్నది సర్వసాధారణం. లేని పరుగు కోసం ప్రయత్నిస్తూ కొందరు.. తోటి బ్యాటర్‌తో సమన్వయ లోపం వల్ల మరికొందరు పెవిలియన్ చేరుతుంటారు. అయితే ఈ రనౌట్ మాత్రం పై రెండింటికి విభిన్నం. అసలే భారీ కాయంతో పరుగెత్తడమే కష్టం అనుకంటే.. అందునా నింపాదిగా నడిచి పెవిలియన్ బాట పట్టాడు.

'రఖీమ్ కార్న్​వాల్..' క్రికెట్ గురుంచి తెలిసిన ప్రతి ఒక్కరికీ ఇతని గురుంచే తెలిసే ఉంటుంది. దాదాపు 6 అడుగుల 6 అంగుళాల ఎత్తు, 140కి పైగా కిలోల బరువుండే ఇతగాడు మైదానంలోకి అడుగుపెట్టినప్పుడల్లా అభిమానుల దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాడు. సాధారణంగా కార్న్​వాల్ సింగిల్స్ ఎక్కువ తీయడు. అది కూడా బంతి దూరం వెళ్తే తప్ప పరుగెత్తడు. అలాంటిది లేని పరుగు కోసం ప్రయత్నించి పెవిలియన్ చేరాడు.  

సీపీఎల్ 2023లో భాగంగా శుక్రవారం బార్బడోస్ రాయల్స్, లూసియా కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ టోర్నీలో బార్బడోస్ రాయల్స్ తరఫున ఆడుతున్న కార్న్‌వాల్.. శుక్రవారం లూసియా కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‍లో అనూహ్య రీతిలో రనౌటయ్యాడు. కింగ్స్ నిర్ధేశించిన 202 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన కార్న్‌వాల్.. తొలి బంతిని ఫైన్ లెగ్ వైపు ఆడాడు. దీంతో నాన్ స్ట్రైక్ ఎండ్ లో ఉన్న కైల్ మేయర్స్  సింగిల్ కోసం ప్రయత్నించగా.. సరేనంటూ క్రీజు బయటకి కదిలాడు. అయితే వేగంగా పరుగెత్తాల్సింది పోయి నింపాదిగా నడుకుంటూ వెళ్లాడు. దీంతో ఫీల్డర్ నేరుగా వికెట్లకు త్రో వేయడంతో అతని నిరాశతో పెవిలియన్ చేరాడు.

కార్న్‌వాల్ రనౌట్ వీడియో చూసి.. నెటిజన్లు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. ఇలాంటి రనౌట్‍ను తాము ఇంతకు ముందెప్పుడూ చూడలేదంటూ కొందరు కామెంట్లు చేస్తుండగా.. మరికొందరు అతన్ని సమర్థిస్తున్నారు. అతను కావాలని చేయలేదని పరుగెత్తకపోయారని చెప్తున్నారు.