క్రికెట్‌లో రెడ్ కార్డ్: ఈ రూల్‌కు బ‌లైన తొలి క్రికెట‌ర్ సునీల్ న‌రైన్‌

క్రికెట్‌లో రెడ్ కార్డ్: ఈ రూల్‌కు బ‌లైన తొలి క్రికెట‌ర్ సునీల్ న‌రైన్‌

క‌రేబియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్(సీపీఎల్) ద్వారా క్రికెట్‌లోనూ రెడ్ కార్డ్ నిబంధ‌న‌ను అమ‌లులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.  స్లో ఓవ‌ర్ రేట్‌కు పెనాల్టీగా దీన్ని తీసుకొచ్చారు. అంటే నిర్ణీత సమయంలో జట్టు వేయాల్సిన ఓవర్ల కంటే వెనుకబడి ఉంటే అంపైర్.. రెడ్‌కార్డ్ చూపించి ప్లేయర్‌ను బ‌య‌ట‌కు పంపిస్తారు. ఈ రెడ్ కార్డ్ రూల్ కార‌ణంగా ప‌నిష్‌మెంట్‌కు గురైన తొలి క్రికెట‌ర్‌గా సునీల్ న‌రైన్ నిలిచాడు.

ఆదివారం ట్రిన్‌బాగో నైట్ రైడర్స్, సెయింట్ కిట్స్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ లో అంపైర్.. రెడ్ కార్డ్ రూల్‌ను అమ‌లు చేశాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆ జట్టు కెప్టెన్ కీరన్ పోలార్డ్.. నిర్ణీత సమయంలో వేయాల్సిన ఓవర్లను పూర్తి చేయలేదు. దీంతో నరైన్ మైదానాన్ని వీడాడు.

ఒక్కో ఓవ‌ర్‌కు 4 నిమిషాల 15 సెక‌న్లు

సీపీఎల్‌ నిబంధనల ప్రకారం.. ఒక్కో ఇన్నింగ్స్ 85 నిమిషాల్లోగా పూర్తిచేయాలి. అంటే ఒక్కో ఓవ‌ర్ ను 4 నిమిషాల 15 సెక‌న్ల చొప్పున‌ వేయాలి. ఈ లెక్కన 17వ ఓవర్‌ను 72 నిమిషాల 15 సెకన్లలో, 18వ ఓవర్‌ను 76 నిమిషాల 30 సెకన్లలో, 19వ ఓవర్‌ను 80 నిమిషాల 45 సెక‌న్ల‌లో 19 ఓవ‌ర్లు  పూర్తి చేయాలి. కానీ, సెయింట్ కిట్స్ 80 నిమిషాల 45 సెక‌న్లు ముగిసేసరికి ఒక ఓవర్ వెనుకబడి ఉంది. దీంతో అంపైర్.. స్లో ఓవ‌ర్ రేట్ కార‌ణంగా నైట్ రైడ‌ర్స్‌కు రెడ్ కార్డ్ చూపించాడు. అనంతరం కెప్టెన్ పొలార్డ్ సూచ‌న మేర‌కు సునీల్ న‌రైన్ మైదానాన్ని వీడాడు. దీంతో ఆఖరి ఓవ‌ర్‌లో కేవ‌లం ప‌దిమంది ఆట‌గాళ్ల‌తోనే నైట్ రైడ‌ర్స్ ఫీల్డింగ్ చేసింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సెయింట్ కిట్స్ నిర్ణీత ఓవ‌ర్ల‌లో 178 ప‌రుగులు చేయగా.. నైట్ రైడర్స్ 17 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించింది. నికోల‌స్ పూర‌న్(61), పొల్లార్డ్(37) పరుగులతో రాణించారు.