సీతారాం ఏచూరికి నివాళి

సీతారాం ఏచూరికి నివాళి

వర్ని,వెలుగు: సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి విప్లవ ఉద్యమానికి తీరని లోటు అని సీపీఎం ఏరియా కార్యదర్శి నన్నేసాబ్‌‌‌‌‌‌‌‌ అన్నారు. శుక్రవారం వర్ని మండల కేంద్రంలో సుభాష్‌‌‌‌‌‌‌‌ చంద్రబోస్‌‌‌‌‌‌‌‌ చౌరస్తాలో సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీతారాం ఏచూరి తాను నమ్మిన సిద్ధాంతం కోసం విద్యార్థి దశ నుంచి తుది శ్వాస వరకు కట్టుబడి ఉన్నారన్నారు.   సమ సమాజ నిర్మాణం కోసం విప్లవ ఉద్యమాలు చేపట్టిన నిబద్ధత కలిగిన గొప్ప నాయకుడని కొనియాడారు. పార్టీ కార్యకర్తలు ఆయన అడుగు జాడల్లో నడవాలన్నారు.  


బోధన్​,వెలుగు: సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్​ సీతారాం ఏచూరి  ఈనెల 12న ఢిల్లీలోని ఎయిమ్స్​హాస్పిటల్​మృతి చెందడంతో ఆ పార్టీలకు చెందిన నాయకులు బోధన్​లోని అంబేద్కర్​ చౌరస్తాలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు బండారి మల్లేష్, గంగాధరప్ప, శంకర్ గౌడ్, యేశాల గంగాధర్​, పుట్ట వరదయ్య పాల్గొన్నారు.

కామారెడ్డి టౌన్​ :  సీపీఎం అగ్రనేత సీతారాం ఏచూరి ఆశయాలను కొనసాగిద్దామని ఆపార్టీ నాయకులు   పేర్కొన్నారు.   శుక్రవారం సీతారాం మృతికి సంతాపం తెలిపారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో  డీటీఎఫ్​స్టేట్​ కౌన్నిల్ మాజీ సభ్యుడు విజయరామరాజు, బీవీఎం స్టేట్​సెక్రటరీ విఠల్,  ఎస్​ఎఫ్​ఐ జిల్లా ప్రెసిడెంట్ ముదాం అరుణ్, పీడీఎస్​యూ జిల్లా ప్రెసిడెంట్ సురేష్​ తదితరులు పాల్గొన్నారు.

నిజామాబాద్ :  కమ్యూనిస్టు పార్టీ యోధుడు, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణం పట్ల పార్టీ జిల్లా శాఖ తీవ్ర సంతాపం ప్రకటించింది. శుక్రవారం నగరంలో ఏర్పాటు చేసిన ప్రొగ్రాంలో జిల్లా సెక్రటరీ రమేశ్​బాబు నేతృత్వంలో నాయకులు ఆయన ఫొటోకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. భారత కమ్యూనిస్టు చరిత్రలో ఆయన భాగస్వామ్యం ఎప్పటికీ నిలిచిపోతుందన్నారు. నివాళులర్పించినవారిలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు పెద్ది వెంట్రాములు, నూర్జహాన్, రామ్మోహన్, విగ్నేష్, రాములు,  సాయిలు తదితరులు ఉన్నారు.