జనగామ/ బచ్చన్నపేట, వెలుగు : ఎంపీ ఎలక్షన్లలో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న తనను గెలిపించాలని సీపీఎం భువనగిరి ఎంపీ అభ్యర్థి ఎండీ జహంగీర్ కోరారు. సోమవారం జనగామ సీపీఎం జిల్లా ఆఫీస్లో మీడియాతో, బచ్చన్నపేటలో ఏర్పాటు చేసిన
కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.స్థానిక సమస్యలే ఎజెండాగా పేదల కోసం పోరాడే కమ్యూనిస్టులను గెలిపించాలని కోరారు. ఆయన వెంట పార్టీ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి తదితరులు పాల్గొన్నారు.