మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

నారాయణపేట, వెలుగు: నారాయణపేట మండల పరిధిలోని కోటకొండ గ్రామాన్ని మండలం చేయాలని  సీపీఎం, సీసీఐ ఎంఎల్ ప్రజాపంథా నేతలు డిమాండ్ చేశారు.  బుధవారం కలెక్టరేట్‌‌‌‌ ఏవో,  ఆర్డీవో కార్యాలయ ఏవోకు వినతి పత్రం అందజేశారు.  ఈ సందర్భంగా సీపీఎం నేతలు బాల్ రామ్, దస్తప్ప,  కాశప్ప మాట్లాడుతూ  కోటకొండ చుట్టూ దాదాపుగా ఇరవై గ్రామాల ప్రజలకు తమ అవసరాల కోసం గ్రామానికే వస్తారన్నారు. ఎస్బీఐ, పోస్టల్, ప్రభుత్వ ఆస్పత్రులు, అటవీశాఖ రేంజ్ ఆఫీస్,  ప్రభుత్వ ఉన్నత పాఠశాల, స్కూల్ కాంప్లెక్స్ కేంద్రం, అంగన్‌‌‌‌వాడీ సెక్టర్ కేంద్రం,   విద్యుత్ సబ్ స్టేషన్, సంత  బజార్... ఇలా అన్ని వసతులు కోటకొండలో ఉన్నాయన్నారు.  ఈ కార్యక్రమంలో సీపీఎం నేతలు బాలకృష్ణ, మన్యం, దినకర్, ఎం దస్తప్ప, జి  లక్ష్మయ్య, జములప్ప,  సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా డివిజన్ నేతలు నారాయణ శివాజీ , సలీమ్, అరుణోదయ ఉమ్మడి జిల్లా సహాయ కార్యదర్శి అంజి, ప్రగతిశీల యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రతాప్  పాల్గొన్నారు.

బాలుడిని చంపిన టీచర్‌‌‌‌‌ను ఉరి తీయాలి
మహబూబ్ నగర్ టౌన్, మక్తల్, అయిజ, వెలుగు:  కుండలో నీళ్లు తాగాడని రాజస్థాన్‌‌లోని జలోర్ జిల్లా సురానా గ్రామంలో ఓ స్కూల్‌‌‌‌లో చదువుకుంటున్న 9 ఏళ్ల ఇంద్రకుమార్‌‌‌‌‌‌‌‌ను కొట్టి చంపిన అగ్రకుల టీచర్‌‌‌‌‌‌‌‌ను ఉరితీయాలని   కేవీపీఎస్‌‌‌‌, ఎమ్మార్పీఎస్‌‌‌‌, ఇతర ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు.  బుధవారం జిల్లా, నియోజకవర్గ కేంద్రంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా  వారు మాట్లాడుతూ అట్టడుగు వర్గాలకు చెందిన స్టూడెంట్స్ నేటికీ కుల వివక్షకు, అంటరానితానికి గురవుతున్నారని వాపోయారు.  మృతి చెందిన బాలుడి కుటుంబానికి రూ. కోటి ఎక్స్‌‌‌‌గ్రేషియా ఇవ్వడంతో పాటు ఒకరికి  ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేవీపీఎస్‌‌‌‌ పాలమూరు జిల్లా ప్రెసిడెంట్ కావలి పరుశురాం,  ఎమ్మార్పీఎస్ పేట జిల్లా కన్వీనర్ నగేశ్,  నేతలు ఆదివిష్ణు,  శ్రీను, సురేశ్‌‌‌‌  లక్ష్మణ్, రాజేశ్, నాగరాజు, ఆంజనేయులు,  విజయభాస్కర్ రెడ్డి, అశ్వ మారెప్ప, రాజు, జ్ఞాన ప్రకాశ్, నారాయణ పాల్గొన్నారు.

గద్వాల మున్సిపాలిటీకి ఓడీఎఫ్ సర్టిఫికెట్
గద్వాల టౌన్, వెలుగు:   గద్వాల మున్సిపాలిటీకి కేంద్ర ప్రభుత్వం ఓడీఎఫ్ సర్టిఫికెట్ జారీ చేసిందని మున్సిపల్ కమిషనర్ జానకిరామ్ సాగర్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ కేంద్రం ప్రతి ఏడాది  టౌన్‌‌లలో బహిరంగ మలమూత్ర రహిత మున్సిపాలిటీలను గుర్తించి ఓడీఎఫ్ సర్టిఫికెట్ ఇస్తుందన్నారు.  2022 ఏడాదికి గద్వాల మున్సిపాలిటీకి ఆ ఘనత సాధించిందని వివరించారు. 


రక్తదానాన్ని బాధ్యతగా తీసుకోవాలి
రక్తదానాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్లు, కలెక్టర్లు పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా బుధవారం జిల్లా, మండల ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా యువకులతో పాటు నేతలు, పలువురు ఆఫీసర్లు బ్లడ్ ఇచ్చారు. అనంతరం కలెక్టర్లు వీరికి సర్టిఫికెట్లు అందించారు. అడిషనల్ కలెక్టర్లు, డీఎంహెచ్‌‌‌‌వోలు, రెవెన్యూ, మున్సిపల్ ఆఫీసర్లతో పాటు రెడ్‌‌‌‌క్రాస్‌‌‌‌ మెంబర్లు పాల్గొన్నారు.  - నెట్‌‌‌‌వర్క్‌‌‌‌, వెలుగు


స్టూడెంట్లకు ఇబ్బందులు రానివ్వొద్దు

 బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వెంకటేశం 
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు:  హాస్టళ్లలో స్టూడెంట్లకు ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఆఫీసర్లను ఆదేశించారు. బుధవారం  నాగర్ కర్నూల్ ఉయ్యాలవాడ,  కోడేరు మహాత్మా జ్యోతిబాపూలే  గురుకుల పాఠశాలలను తనిఖీ చేశారు.   ఈ సందర్భంగా సమస్యలపై స్టూడెంట్లను ఆరా తీశారు.  మోనూ ప్రకారం నాణ్యమైన భోజనం పెట్టాలని,  పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రిన్సిపాల్స్‌‌‌‌కు సూచించారు.  మౌలిక సదుపాయాల కల్పనలో రాజీపడవద్దని చెప్పారు. స్టూడెంట్లను ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట  కలెక్టర్ ఉదయ్ కుమార్,  అదనపు కలెక్టర్ మనూ చౌదరి, బీసీ వెల్ఫేర్‌‌‌‌‌‌‌‌ అడిషనల్ డైరెక్టర్ మల్లయ్య బట్టు,  జిల్లా ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ అనిల్ ప్రకాశ్ ఉన్నారు.

అనుమానాస్పదంగా దళిత రైతు మృతి
అయిజ, వెలుగు:  గట్టు మండలం తప్పట్లమొర్సు గ్రామానికి చెందిన దళిత రైతు అనుమానా స్పదంగా మృతి చెందాడు. బాధిత కుటుంబసభ్యులు, పోలీసుల వివరాల ప్రకారం..  తప్పట్లమొర్సు గ్రామానికి చెందిన హరిజన్ బెంజిమెన్ (బీసన్న) (60)  పదేళ్ల క్రితం అయిజ మండలం ఎక్లాస్ పురంలో ఐదెకరాల భూమిని కొని తన భార్య లక్ష్మీదేవి పేరిట రిజిస్ట్రేషన్ చేయించాడు. అయితే  ఈ భూమి విషయంలో ఎక్లాస్ పురానికి చెందిన కుతుబుద్దీన్‌‌తో కొన్నాళ్లుగా వివాదం నడుస్తోంది.  బుధవారం ఉదయం పొలం పనుల కోసం వెళ్లిన బెంజిమెన్ గ్రామ సమీపంలో శవమై కనిపించాడు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అయిజ ఎస్సై నరేశ్ కుమార్ సంఘటనా స్థలానికి  చేరుకొని విచారణ చేపట్టారు. డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం పంపించి.. మృతుడి కుమారుడు ప్రేమ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.  బెంజిమెన్ ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. 

డిగ్రీ కాలేజీలో న్యాక్ టీమ్
గద్వాల, వెలుగు:  జిల్లా కేంద్రంలోని ఎంఏఎల్‌‌‌‌డీ  డిగ్రీ కాలేజీని న్యాక్‌‌‌‌ టీమ్‌‌‌‌ సందర్శించింది. ప్రొఫెసర్ రాజేశ్ గుప్తా, ప్రొఫెసర్ ధనంజిత్ సింధు, డాక్టర్ ధనంజయ్ తల్వంపర్‌‌‌‌‌‌‌‌తో కూడిన ఈ టీమ్‌‌‌‌కు బుధవారం ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి,  ప్రిన్సిపాల్ శ్రీపతి నాయుడు స్వాగతం పలికారు. అనంతరం ఐదేండ్లలో కాలేజీలో జరిగిన అభివృద్ధిపై న్యాక్‌‌‌‌  బృందానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. వివిధ డిపార్ట్‌‌‌‌మెంట్ల హెచ్‌‌‌‌వోడీలు కూడా వేరువేరుగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కాలేజీలో స్టూడెంట్లకు కల్పిస్తున్న సౌకర్యాలతో పాటు ప్రాక్టికల్‌‌‌‌ కోర్సుల గురించి వివరించారు.  అంతకుముందు కాలేజీలోని గుడిలో పూజలు చేసి క్యాంటీన్‌‌‌‌ను ఓపెన్ చేశారు. అనంతరం కలెక్టర్ వల్లూరు క్రాంతి న్యాక్‌‌‌‌ బృందాన్ని కలిశారు. 


పట్టా భూముల సమస్యలు పరిష్కరించాలి
    కలెక్టర్ వల్లూరు క్రాంతి
గద్వాల, వెలుగు:  జిల్లాలో పట్టా భూముల సమస్యలను వెంటనే పరిష్కరించాలని  కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్‌‌లో తహసీల్దార్లతో మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  ధరణిలో  పట్టాదారు పేర్లు, విస్తీర్ణం, మిస్సింగ్ సర్వే నెంబర్లకు సంబంధించిన సమస్యలపై ఫోకస్‌‌‌‌ చేయాలన్నారు. ప్రతిరోజు టార్గెట్ పెట్టుకొని పనిచేయాలని సూచించారు. అడిషనల్‌‌‌‌ కలెక్టర్ శ్రీహర్ష,  ఆర్డీవో రాములు, సూపరింటెండెంట్ రాజు పాల్గొన్నారు.

బడి మానేసిన పిల్లలను గుర్తించండి
బడి మానేసిన పిల్లలను గుర్తించి స్కూల్‌‌‌‌లో చేర్పించాలని కలెక్టర్ వల్లూరి క్రాంతి ఆఫీసర్లను ఆదేశించారు.  శిశు, సంక్షేమ శాఖ మీటింగ్‌‌‌‌లో ఆమె మాట్లాడుతూ చైల్డ్ లేబర్ తో పని చేయించుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  అడిషనల్ కలెక్టర్ శ్రీహర్ష, శిశు సంక్షేమ శాఖ ఆఫీసర్ ముసాయిదా బేగం, కార్మిక శాఖ ఆఫీసర్ మహేశ్‌‌‌‌ కుమార్, డీఈవో సిరాజుద్దీన్ పాల్గొన్నారు.

పెండింగ్ వేతనాలివ్వాలి
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు :  పెండింగ్ వేతనాలు చెల్లించాలని నాగర్ కర్నూల్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ స్వీపర్లు, దోబి కార్మికులు డిమాండ్ చేశారు.  బుధవారం ఆస్పత్రి ముందు మెరుపు సమ్మెకు దిగారు.  ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ ధోబి కార్మికులకు 8 నెలలుగా,  కాంట్రాక్ట్ స్వీపర్లు, సెక్యూరిటీ గార్డులకు మూడు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని మండిపడ్డారు.  కాంట్రాక్టర్‌‌‌‌‌‌‌‌ను అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారని వాపోయారు.  స్వీపర్ల, సెక్యూరిటీ గార్డులు, ధోబీ కార్మికులు 35 ఏండ్లుగా తక్కువ వేతనానికి పనిచేస్తున్నారని, వారిని వెంటనే  పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ  నాయకులు రామయ్య, అశోక్, బాలకృష్ణమ్మ, రంజాన్, ఖలీల్, అలివేల, కృష్ణయ్య, రాణి తదితరులు పాల్గొన్నారు. 

5 లక్షల మొక్కలు నాటాలి

 ఇన్‌‌‌‌చార్జి కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ 
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు:  వజ్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 21న అన్ని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు, మండలాల్లో హరితహారం కింద 5 లక్షల మొక్కలు నాటాలని ఇన్‌‌‌‌చార్జి కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆదేశించారు. మంగళవారం తన చాంబర్‌‌‌‌‌‌‌‌లో జిల్లా ఆఫీసర్ల మీటింగ్‌‌‌‌లో ఆమట్లాడుతూ జిల్లాలోని మూడు మున్సిపాలిటీలతో పాటు అన్ని మండలాలు, జీపీల్లో పెద్దఎత్తున మొక్కలు నాటేలా ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సీతారామారావు, డీఆర్డీవో యాదయ్య, డీపీవో వెంకటేశ్వర్లు,   మున్సిపల్ కమిషనర్లు ప్రదీప్ కుమార్, నూరూల్ నజీబ్ షేక్, ఇరిగేషన్ ఎస్ఈ శ్రీధర్, డీఈ మనోహర్ పాల్గొన్నారు.

ప్రీడమ్ కప్ పోటీలకు ఏర్పాట్లు చేయండి
వజ్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 18న కేసీఆర్‌‌‌‌‌‌‌‌ ఎకో అర్బన్ పార్కులో ఎంప్లాయీస్‌‌‌‌కు నిర్వహించే ప్రీడమ్ కప్ పోటీలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అడిషనల్ కలెక్టర్ కె.సీతారామారావు ఆదేశించారు. బుధవారం తన చాంబర్‌‌‌‌‌‌‌‌లో సంబంధిత ఆఫీసర్లతో నిర్వహించిన రివ్యూలో మాట్లాడుతూ సీనియర్, జూనియర్‌‌‌‌‌‌‌‌ విభాగాల్లో స్ర్తీ, పురుషులకు సపరేట్‌‌‌‌గా పోటీలు నిర్వహించాలన్నారు.  ఈ కార్యక్రమంలో డీఎస్‌‌‌‌డీవో శ్రీనివాస్, జిల్లా పశుసంవర్థక అధికారి మధుసూదన్, డీపీవో వెంకటేశ్వర్లు, జడ్పీ సీఈవో జ్యోతి,  మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ శంకరాచారి,  బీసీ వెల్ఫేర్  ఆఫీసర్ ఇందిర, డీఎస్వో వనజాత, కలెక్టరేట్ ఏవో కిషన్ పాల్గొన్నారు.

టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ లీడర్ లిక్కర్ దందా

గద్వాల, వెలుగు: కర్నాటక లిక్కర్‌‌‌‌‌‌‌‌ దందా చేస్తున్న టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ లీడర్‌‌‌‌‌‌‌‌ ఇల్లు, షాప్‌‌‌‌పై  టాస్క్‌‌‌‌ఫోర్స్‌‌‌‌ ఆఫీసర్లు దాడి చేశారు.  గద్వాల సీఐ చంద్రశేఖర్ వివరాల ప్రకారం..  కేటీదొడ్డి మండలం పాతపాలెం గ్రామానికి చెందిన టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ నేత వెంకన్న గౌడ్‌‌‌‌ అక్రమంగా లిక్కర్‌‌‌‌ దందా చేస్తున్నారని‌‌‌‌ టాస్క్‌‌‌‌ ఫోర్స్‌‌‌‌ టీమ్‌‌‌‌కు పక్కా సమాచారం వచ్చింది.  దీంతో బుధవారం ఉదయం అతని ఇంటితో పాటు కిరాణా షాపు, స్విఫ్ట్ డిజైర్‌‌‌‌‌‌‌‌ కారులో తనిఖీలు చేశారు.  కర్ణాటకకు చెందిన ఒరిజినల్ ఛాయిస్ 90 ఎంఎల్ టెట్రా ప్యాక్ , 20 కాటన్లు దొరికాయి. దీంతో లిక్కర్‌‌‌‌‌‌‌‌తో పాటు కారును స్వాధీనం చేసుకొని వెంకన్న గౌడ్‌‌‌‌ను అదుపులోకి తీసుకున్నామని సీఐ తెలిపారు.  ఎఫ్‌‌‌‌ఐఆర్ నమోదు చేశామని, పంచనామా అనంతరం ఎక్సైజ్ పోలీసులకు అప్పజెప్తామని చెప్పారు. కాగా, దాడులు చేసిన సమయంలో రెండు కార్లలో లిక్కర్‌‌‌‌‌‌‌‌ దొరికిందని, ఓకారును పోలీసులు తప్పించారని గ్రామస్తులు చెబుతున్నారు.  నిందితుడిని పీఎస్‌‌‌‌కు తీసుకెళ్తుండగా ఓ లీడర్‌‌‌‌‌‌‌‌ ఫోన్‌‌‌‌ చేయడంతో ఇన్నోవాను వదిలేసి స్విఫ్ట్‌‌‌‌ను మాత్రమే తీసుకెళ్లారని తెలిసింది.  

గతంలోనూ..
ఏడాది క్రితం ట్రాక్టర్ ట్రాలీలో కర్ణాటక లిక్కర్ ఉంచి, పైన గడ్డి కప్పి తరలిస్తుండగా ధరూర్ మండల కేంద్రంలో పోలీసులు పట్టుకున్న కేసులోనూ వెంకన్న గౌడే సూత్రధారి. ట్రాలీలో దాదాపు రూ. 20 లక్షల విలువ  లిక్కర్ దొరికింది.  గతేడాది పాతపాలెం దగ్గర నకిలీ లిక్కర్ కేసులోనూ ఇతన్ని ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో మరో నిందితుడు స్పిరిట్ శ్రీను ఇంకా పరారీలోనే ఉన్నాడు.