జమిలి ఎన్నికలను వ్యతిరేకించాలి : చెరుపల్లి సీతారాములు

జమిలి ఎన్నికలను వ్యతిరేకించాలి : చెరుపల్లి సీతారాములు
  •     సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు

యాదాద్రి, వెలుగు : జమిలి ఎన్నికల కారణంగా ఫెడరల్​స్ఫూర్తికి విఘాతం కలుగుతుందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు అన్నారు. గురువారం భువనగిరిలో జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. నంబర్ గేమ్​కోసమే బీజేపీ ఒకే దేశం-.. ఒకే ఎన్నిక విధానాన్ని తీసుకొస్తుందని ఆరోపించారు. దీని వల్ల దేశ ఐక్యతకు భంగం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

 జమిలి ఎన్నికల పేరుతో రాజ్యాంగాన్ని సవరించడానికి బీజేపీ కుట్ర పన్నుతోందని తెలిపారు. అందరూ ఏకమై జమిలి ఎన్నికల విధానాన్ని వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు. కొండమడుగు నర్సింహా అధ్యక్షతన జరిగిన సమావేశంలో నాయకులు మంగ నరసింహులు, మాటూరి బాలరాజు, దోనూరు నర్సిరెడ్డి, కల్లూరు మల్లేశం, దాసరి పాండు, దయ్యాల నరసింహ, మాయ కృష్ణ, సిర్పంగి స్వామి, పెంటయ్య పాల్గొన్నారు. 

జమిలి ఎన్నికల ఆమోదం సరికాదు 

చండూరు (గట్టుప్పల్), వెలుగు : జమిని ఎన్నికల విధానానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడం సరికాదని సీపీఎం జిల్లా కార్యదర్శి ముదిగొండ సుధాకర్ రెడ్డి అన్నారు. గురువారం గట్టుప్పల్​ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సీపీఎం మహాసభకు ఆయన హాజరై మాట్లాడారు. ఓట్ల  రాజకీయం కోసం చరిత్రను వక్రీకరిస్తారా..? అని కేంద్రాన్ని ప్రశ్నించారు. తెలంగాణ సాయుధ పోరాటానికి కమ్యూనిస్టులు నాయకత్వం వహించి, రాచరికపు భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారని చెప్పారు. ఎన్నికలకు ముందు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు.