కులాంతర వివాహం చేసుకున్నవారి భద్రతకు ప్రత్యేక చట్టం తేవాల : జాన్ వెస్లీ

కులాంతర వివాహం చేసుకున్నవారి భద్రతకు ప్రత్యేక చట్టం తేవాల : జాన్ వెస్లీ
  • సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్

హైదరాబాద్, వెలుగు: కులాంతర వివాహం చేసుకున్నవారిపై హత్యలు, దాడులు, బహిష్కరణలు జరుగుతున్నా ప్రభుత్వాలు, పోలీసులు రక్షణ కల్పించలేకపోతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్  వెస్లీ అన్నారు. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కులాంత వివాహాలు చేసుకున్న వారి భద్రత కోసం ప్రత్యేక రక్షణ చట్టం చేయాలని శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే 45 పరువు హత్యలు జరిగాయని ఆయన పేర్కొన్నారు. తుంగతుర్తి మండలం అన్నారం గ్రామంలో ఇటీవల జరిగిన పరువు హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.

దళిత కులానికి చెందిన వడ్లకొండ కృష్ణ, బీసీ కులానికి చెందిన భార్గవి ఐదు నెలల క్రితం కులాంతర వివాహం చేసుకున్నారని, కుటుంబం పరువు పోయిందనే నెపంతో భార్గవి కుటుంబ సభ్యులు కృష్ణను హత్య చేశారన్నారు. నిందితులపై గతంలోనే అనేక కేసులు నమోదై ఉన్నాయని, వారిని అరెస్టు చేయడంతోనే సరిపెట్టకుండా, ఫాస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  కోర్టు ఏర్పాటు చేసి కఠినంగా శిక్షించాలని కోరారు. భార్గవికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు భద్రత కల్పించాలని, కృష్ణ కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  చేశారు.