జనగామ కలెక్టర్‌‌‌‌ను ఎలక్షన్‌‌‌‌ డ్యూటీ నుంచి తొలగించాలి:

జనగామ అర్బన్, వెలుగు : అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్న జనగామ కలెక్టర్‌‌‌‌ శివలింగయ్యను ఎలక్షన్‌‌‌‌ డ్యూటీ నుంచి తొలగించాలని ప్రజా, విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్‌‌‌‌ చేశారు. సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం జనగామలోని వైష్ణవి గార్డెన్స్‌‌‌‌లో రౌండ్‌‌‌‌ టేబుల్‌‌‌‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహించాల్సిన జిల్లా అధికారి బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కు మద్దతుగా పనిచేస్తున్నారని ఆరోపించారు.

కలెక్టర్‌‌‌‌ను ఎన్నికల విధుల నుంచి తప్పించి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి, నాయకులు వంగాల మల్లారెడ్డి, సొప్పరి సోమయ్య, పెందుర్తి వెంకట్‌‌‌‌రెడ్డి, మంగళంపల్లి రాజు, అభిగౌడ్, విజయ్, లలిత, జోగు ప్రకాశ్‌‌‌‌ పాల్గొన్నారు.