సత్తుపల్లి, వెలుగు : ఈనెల 18 , 19న సీపీఎం జిల్లా మహాసభలు జరుగుతాయని ఈ కార్యక్రమానికి కేంద్ర రాష్ట్ర నాయకులు బీబీ రాఘవులు, తమ్మినేని వీరభద్రం, వీరయ్య హాజరునున్నట్లు ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు బి వెంకట్ తెలిపారు. సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కోసం అమలు సాధ్యంకాని హామీలు ఎన్నో ఇచ్చి, ప్రస్తుతం వాటికి దూరంగా జరుగుతుందని విమర్శించారు.
కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా భారత రాజ్యాంగాన్ని పక్కనపెట్టి మతోన్మాద విధానాలకు పోతుందని దుయ్యబట్టారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకురాలు మాచర్ల భారతి మాదినేని రమేశ్ జిల్లా నాయకులు జాజిరి శ్రీనివాస్ మోరంపూడి పాండు చలమాల విఠల్, శీలం సత్యనారాయణ రెడ్డి, రావుల రాజబాబు, కొలికపోక సర్వేశ్వరరావు, జాజిరి జ్యోతి శిలం కరుణ, రామలింగేశ్వరరావు, తిరుపతిరావు, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.