బాణాపురం వద్ద బైపాస్​ రోడ్డు..అండర్​పాస్​ నిర్మించాలి

బాణాపురం వద్ద బైపాస్​ రోడ్డు..అండర్​పాస్​ నిర్మించాలి

జనగామ, వెలుగు : జనగామ శివారు బాణాపురం వద్ద బైపాస్​ రోడ్డు పై అండర్​ పాస్​ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి ఆధ్వర్యంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్​కుమార్​ రెడ్డిని ఆదివారం కలిసి వినతి పత్రం అందించారు.

అండర్​ పాస్​ లేకపోవడం వల్ల బాణాపురం వాసులే కాకుండా ఎల్లంల, సిద్దెంకి, చౌదరిపల్లి, పెద్దరాంచర్ల, శ్రీనివాస పురం, కొలనుపాక నుంచి జనగామకు వచ్చే వారికి ప్రయాణికులకు ఇబ్బందులు కలుగుతాయన్నారు. ఇప్పటికైనా బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో బూడిద గోపి, జోగు ప్రకాశ్, విజేందర్, కనకాచారి తదితరులు పాల్గొన్నారు.