శ్మశానవాటికలో మౌలిక సదుపాయాలు కల్పించాలి : తుమ్మల వీరారెడ్డి

శ్మశానవాటికలో మౌలిక సదుపాయాలు కల్పించాలి : తుమ్మల వీరారెడ్డి

నల్గొండ అర్బన్, వెలుగు : నల్గొండలోని 11 వ వార్డు కతాల్ గూడ శ్మశానవాటిక లో మౌలిక సదుపాయాలు కల్పించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. సీపీఎం పోరుబాటలో భాగంగా మంగళవారం పట్టణంలోని 11 వ వార్డు సమస్యలపై అధ్యయనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అనేక వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. 

పట్టణంలో 2013లో విలీనమైన మామిళ్లగూడెం గ్రామపంచాయతీ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు. విలీనమైన తర్వాత ఉపాధి హామీ పని కోల్పోయారని చెప్పారు. దేవరకొండ రోడ్డు నుంచి శ్వశానం వరకు సీపీ రోడ్డు నిర్మించాలన్నారు. శ్మశాన వాటికకు ప్రహరీ గోడ, నీటి సదుపాయం, స్నానపు గదులు, దహన వాటికలు నిర్మించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు సయ్యద్ హశం, పట్టణ కార్యదర్శి సత్తయ్య, నాయకులు పాల్గొన్నారు.