- పాల్గొన్న 5 వేలకు పైగా మహిళలు
జగిత్యాల టౌన్, వెలుగు : నిరుపేదలకు ఇండ్ల స్థలాలు కేటాయించి పట్టాలివ్వాలంటూ జగిత్యాల జిల్లా కేంద్రంలో కలెక్టరేట్నుంచి సీపీఎం భారీ ర్యాలీ నిర్వహించింది. ఇందులో సుమారు 5వేలకు పైగా మహిళలు పాల్గొన్నారు. ముందు ఆర్డీవో ఆఫీస్ లో వినతిపత్రం ఇచ్చి మళ్లీ ర్యాలీగా ప్రజావాణికి తరలివెళ్లి దరఖాస్తులు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు సీపీఎం లీడర్లు మాట్లాడుతూ జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్ శివారులోని ప్రభుత్వ భూమిని తమకు ఇవ్వాలని ఇండ్లు
లేని పేదలు రెండు నెలలుగా తాత్కాలిక షెడ్లు వేసుకొని నిరసన తెలుపుతున్నారన్నారు. గత ప్రభుత్వం పట్టించుకోలేదని, సీఎం రేవంత్ రెడ్డి స్పందించి పేదలకు పట్టాలు ఇచ్చే విధంగా చొరవ చూపాలని కోరారు. జగిత్యాల ఇండ్ల స్థలాల పోరాట సమితి కన్వీనర్ రమేశ్, సుధారాణి, శేఖర్ , సులోచన, బాలకృష్ణ, చంద్రయ్య పాల్గొన్నారు.