కేంద్ర బడ్జెట్​లో ప్రయారిటీ ఇవ్వాలి

కేంద్ర బడ్జెట్​లో ప్రయారిటీ ఇవ్వాలి

కామారెడ్డి​టౌన్, వెలుగు: కేంద్ర బడ్జెట్​లో కామారెడ్డి జిల్లాకు తగిన ప్రయారిటీ ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి కె. చంద్రశేఖర్​ డిమాండ్​ చేశారు. పట్టణంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. 11 ఏండ్లుగా కేంద్రంలోని బీజేపీ సర్కారు కామారెడ్డి జిల్లాకు ఎలాంటి సహకారం అందించలేదన్నారు. అయినప్పటికీ ఇక్కడి ప్రజలు కామారెడ్డి ఎమ్మెల్యేగా బీజేపీ క్యాండిడేట్​ను గెలిపించారన్నారు. 

సికింద్రాబాద్​ నుంచి కామారెడ్డి మీదుగా మన్మాడ్​ వైపు వెళ్లే రైల్వే లైన్​ను డబుల్​ లైన్​గా మార్చాలని, కామారెడ్డి పట్టణంలో  రైల్వే ఫ్లై ఓవర్​ బ్రిడ్జిలను నిర్మించాలని కోరారు. జిల్లాలోని  యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు పరిశ్రమలు మంజూరు చేయాలన్నారు. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు​  వెంకటిగౌడ్, లీడర్లు మోతీరాం, నర్సింహులు, అరుణ్​కుమార్, సురేశ్​ పాల్గొన్నారు.