కౌలు రైతుల రుణాలెలా మాఫీ అవుతాయ్ : బీవీ రాఘవులు

కౌలు రైతుల రుణాలెలా మాఫీ అవుతాయ్ : బీవీ రాఘవులు
  • రైతు రుణమాఫీ గైడ్ లైన్స్​సరిగ్గా లేవు​ 
  • సీపీఎం నేత బీవీ.రాఘవులు వ్యాఖ్య

హనుమకొండ, వెలుగు : రైతు రుణమాఫీ గైడ్​ లైన్స్​ సరిగ్గా లేవని సీపీఎం నేత బీవీ రాఘవులు అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన రైతు రుణమాఫీ విధివిధానాల్లో లోపాలున్నాయని చెప్పారు. బుధవారం ఆయన హనుమకొండ రాంనగర్ లోని సీపీఎం జిల్లా కార్యాలయంలో  మాట్లాడారు. పాస్​ బుక్స్ ఆధారంగా కౌలు రైతులు, పోడుదారుల రుణాలు ఎలా మాఫీ అవుతాయని ప్రశ్నించారు. కౌలుదారులకు ఇవ్వకుండా రుణమాఫీ ఎవరికిచ్చినా ప్రయోజనం ఉండదన్నారు. కౌలు రైతులకు కూడా రుణమాఫీ వర్తించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

గైడ్​ లైన్స్​ సరిగ్గా లేనందునా.. రీషెడ్యూల్ చేసిన రుణాలకు, రైతు మిత్ర గ్రూపులకు, చిన్న, సన్నకారు రైతులకు రుణమాఫీ జరగటం లేదని వివరించారు. మార్గదర్శకాలను వెంటనే మార్చాలని కోరారు. జనగణన, కులగణన చేసిన తరువాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. హనుమకొండ బంధం చెరువులో ఎక్స్ సర్వీస్ మెన్, ప్రభుత్వ ఆఫీసులు, స్వాతంత్ర సమరయోధులకు చెరువు శిఖంలోనే పట్టాలిచ్చారని,  పేదల ఇండ్లను కూల్చేస్తామంటే ఊరుకోబోమని రాఘవులు స్పష్టం చేశారు.