పచ్చని గ్రామాల్లో డంప్​యార్డు వద్దు ; చుక్క రాములు

పచ్చని గ్రామాల్లో డంప్​యార్డు వద్దు ; చుక్క రాములు
  •  సీపీఎం నేత చుక్క రాములు

పటాన్​చెరు(గుమ్మడిదల), వెలుగు: పచ్చని పల్లెల్లో చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోమని సీపీఎం నేత చుక్క రాములు అన్నారు. గుమ్మడిదల మండల పరిధిలోని ప్యారానగర్​ లో డంప్​యార్డు ఏర్పాటుకు వ్యతిరేకంగా చేపట్టిన దీక్షలు, నిరసనలు మంగళవారంతో 14రోజులకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా  చుక్కరాములు పార్టీ నేతలతో కలిసి దీక్షలో పాల్గొన్నారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. పచ్చని పల్లె లను డంప్​యార్డు ఏర్పాటు చేసి నాశనం చేయడం దారుణమన్నారు. ఈ విషయాన్ని జిల్లా, రాష్ట్ర స్థాయికి తీసుకెళ్తామని చెప్పారు. అధికారులు వెంటనే స్పందించి భవిష్యత్​ తరాలకు జరిగే నష్టాలను గుర్తించి డంప్​యార్డు పనులను నిలిపివేయాలన్నారు. గుమ్మడిదలలో చేపట్టిన దీక్షలో బ్రహ్మణ సంఘం పాల్గొని మద్దతు తెలిపింది.