ప్యారానగర్​లో డంపింగ్ యార్డ్ ను రద్దు చేయాలి : సీపీఎం నేత చుక్కా రాములు

ప్యారానగర్​లో డంపింగ్ యార్డ్ ను రద్దు చేయాలి : సీపీఎం నేత చుక్కా రాములు

సంగారెడ్డి టౌన్ వెలుగు: ప్యారానగర్​లో ఏర్పాటు చేస్తున్న డంపింగ్​యార్డును సీఎం రేవంత్​రెడ్డి వెంటనే రద్దు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చుక్కారాములు కోరారు. గురువారం సంగారెడ్డిలోని కేవల్ కిషన్ భవన్ నుంచి కలెక్టరేట్ వరకు నల్లవల్లి, గుమ్మడిదల గ్రామస్తులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజల నిర్ణయాన్ని గౌరవించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఏకపక్షంగా డంపింగ్ యార్డ్ ఏర్పాటుచేయాలని నిర్ణయించడం సరైంది కాదన్నారు.

డంపింగ్ యార్డ్ రద్దుపై 17 గ్రామాలకు చెందిన ప్రజలు వ్యతిరేకిస్తున్నా కలెక్టర్ స్పందించకపోవడం దారుణమన్నారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టరేట్ ఏవో పరమేశ్వర్ కు అందజేశారు. ఆందోళనలో సీపీఎం నేతలు అడివయ్య, మల్లేశం, రాజయ్య, మాణిక్యం, సాయిలు, నర్సింలు, నాగేశ్వర్, ప్రవీణ్ కుమార్, పాండురంగారెడ్డి, అశోక్, రమేశ్ గౌడ్, జేఏసీ నాయకులు కుమార్ గౌడ్, మాజీ సర్పంచ్ శంకరయ్య, సురేశ్, మల్లేశ్, శ్రీనివాస్, ఆంజనేయులు పాల్గొన్నారు.