ఆశావర్కర్లకు రూ. 18వేల జీతం ఇవ్వాలి: తమ్మినేని వీరభద్రం

ఆశావర్కర్లకు రూ. 18వేల జీతం ఇవ్వాలి: తమ్మినేని వీరభద్రం

ఆశా వర్కర్ల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు సీపీఎం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభధ్రం. ఆశావర్కర్ల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బస్సు జాతా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్థానిక పేవిలియన్ గ్రౌండ్ నుంచి మంచికంటి భవన్ కు సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. 

ALSO READ | తెలంగాణలో 10 మండలాలు వెనుబడిన ప్రాంతాలు : కేంద్రమంత్రి బండి సంజయ్

రాష్ట్ర వ్యాప్తంగా పని చేస్తున్న 30వేల మంది  ఆశావర్కర్లందరికీ 18వేల ఫిక్స్ డ్ జీతం ఇచ్చి.. పీఎస్, డీఏ, ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించిందని నిరసన వ్యక్తం చేస్తూ.. ఈనెల 31న హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ దగ్గర బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు తమ్మినేని.