అటవీ సంపద దోచుకోవడం దుర్మార్గం : సీపీఎం రాష్ట్ర నాయకులు ఎ. రాములు  

అటవీ సంపద దోచుకోవడం దుర్మార్గం : సీపీఎం రాష్ట్ర నాయకులు ఎ. రాములు  

గండీడ్, వెలుగు: ప్రకృతిని రక్షించాల్సిన వారే అడవిని నాశనం చేయడం దుర్మార్గమని సీపీఎం పార్టీ రాష్ట్ర నాయకులు ఎ.రాములు, జిల్లా నాయకులు నర్సింలు,లక్ష్మయ్య అన్నారు. ఆదివారం మహమ్మదాబాద్ మండల పరిధిలోని కొండాపూర్ సెక్టార్ పరిధిలోని జూలపల్లి అటవీ ప్రాంతాన్ని ‌ పరిశీలించారు.  ప్లాంటేషన్ పేరుతో సెక్షన్ అధికారి చెట్లను నరికి వేయడం దారుణమన్నారు.  

సంవత్సర కాలం నుంచి ప్లాంటేషన్ పేరుతో చెట్లను నరికి వేస్తున్నప్పటికీ ఉన్నతాధికారులకు  తెలియకపోవడం ఏమిటని ప్రశ్నించారు.   ఉన్నతాధికారుల ప్రమేయంతోనే చెట్లను నరికివేశారని ఆరోపించారు. అందుకే విచారణలో జాప్యం చేస్తున్నారన్నా రు. కలెక్టర్ స్పందించి ‌వెంటనే అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.  కార్యక్రమంలో  రాజు, బాల్ రెడ్డి, జమ్ములయ్య పాల్గొన్నారు