సీపీఎం నేతల ఆందోళన.. అడ్డుకున్న పోలీసులు

సీపీఎం నేతల ఆందోళన.. అడ్డుకున్న పోలీసులు

పటాన్​చెరు(గుమ్మడిదల), వెలుగు: ప్రభుత్వం పేదల ప్రజలకు, రైతులను న్యాయం చేసేదాక పోరాటం ఆగదని సీపీఎం నేతలు అన్నారు.  సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల పరిధిలోని  ప్యారానగర్​లో గల వందల ఎకరాల భూమిని పేద రైతులకు కేటాయించాలని డిమాండ్​ చేస్తూ.. గురువారం గుమ్మడిదల మండల కేంద్రంలో   ఆందోళన కు సిద్ధమయ్యారు. సీపీఎం  నేతలతో పాటు పలువురు ప్రజలు పెద్ద సంఖ్యలో  గుమి కూడి ఆందోళన చేసేందుకు సిద్దమవుతుండగా  విషయం తెలుసుకున్న పోలీసులు  అక్కడికి వచ్చి, సీపీఎం నేతలను  అదుపులోకి తీసుకున్నారు.  వారిని పోలీస్​ స్టేషన్​కు  తరలించి సాయంత్రం వదిలి పెట్టారు.