- హాజరుకానున్న సీఎం రేవంత్‌రెడ్డి, కేటీఆర్
హైదరాబాద్, వెలుగు: సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంస్మరణ సభ శనివారం హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు సీపీఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది.
ఈ సభకు సీఎం రేవంత్‌రెడ్డితోపాటు సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోదండరామ్, ఏపీ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోహన్‌కందా తదితరులు హాజరుకానున్నారు.