సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గురువారం (సెప్టెంబర్ 12 ) ఢిల్లి ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆగస్ట్ 19 నుంచి ఆయన శ్వాసకోశ సంబంధిత అనారోగ్య సమస్యతో చికిత్స పొందుతున్నారు. ఈ రోజు కొద్దిసేపటి క్రితమే సీతారాం ఏచూరు మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. గత రెండు రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించింది. సెప్టెంబర్ 9 నుంచి ఆయన వెంటిలేటర్ పై ఉన్నారు.
1952 ఆగస్ట్ 12 లో ఏచూరు చెన్నైలో జన్మించారు. 10వ తరగతి వరకు హైదరాబాద్ లో చదివారు. ఢిల్లీలో సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో బీఏ ఎకనామిక్స్ ఉత్తీర్ణులైయ్యారు. JNUలో ఎంఏ ఎకనామిక్స్ చదివారు. 1974లో SFI లో చేరారు. జేఎన్ యూలో మూడు సార్లు స్టూడెట్ యూనియన్ నాయకుడిగా గెలిచారు. 1985లో భారత కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీకి ప్రాతినిత్యం వహించారు. 2005లో వెస్ట్ బెంగల్ నుంచి రాజ్యసభ్యకు ఎన్నికైయ్యారు. 2015, 2018, 2022 లో సీపీఎం జనరల్ సెక్రటరీగా ఎన్నికైయ్యారు.