- కొత్తగూడెంలో సీపీఎం నిరసన
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : రాష్ట్రంలోని బొగ్గు బ్లాక్‌ల వేలాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో కొత్తగూడెంలో బుధవారం నిరసన చేపట్టారు. బస్టాండ్ సెంటర్లోని అమరవీరుల స్థూపం వద్ద కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు లిక్కి బాలరాజు మాట్లాడుతూ సింగరేణి ఇప్పటికే సర్వే చేసిన నాలుగు కోల్ బ్లాక్‌లను వేలంలో వేయడం దారుణమన్నారు.
రాష్ట్రం నుంచి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి స్పందించి రాష్ట్రంలోని బొగ్గు బ్లాక్‌లను సింగరేణికి అప్పగించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ ప్రోగ్రామ్ లో నాయకులు అన్నవరపు సత్యనారాయణ, భూక్యా రమేశ్, సందకూరి లక్ష్మి, నగేశ్, రాజు, ప్రశాంత్ పాల్గొన్నారు.