14 మందితో సీపీఎం ఫస్ట్ లిస్ట్..పాలేరు నుంచి తమ్మినేని పోటీ..

అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల జాబితా ప్రకటించింది సీపీఎం. 14 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. పాలేరు నుంచి తమ్మినేని వీరభద్రం, మిర్యాలగూడ నుంచి మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి బరిలో ఉండనున్నారు. కాంగ్రెస్‌తో పొత్తు కోసం సీపీఎం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో తమ అభ్యర్థులను ప్రకటించింది.

Also Read :- అది సర్కార్ భూమేనా? కాదా తేల్చండి

14మంది అభ్యర్థులు వీళ్లే

పాలేరు -   తమ్మినేని వీరభద్రం
ఖమ్మం -  ఎర్ర శ్రీకాంత్
 మధిర -  పాలడుగు భాస్కర్
సత్తుపల్లి -   చర్ల భారతి
 భద్రాచలం  -  కారం పుల్లయ్య 
అశ్వారావుపేట  -  అర్జున్
మిర్యాలగూడ  - జూలకంటి రంగారెడ్డి
 వైరా - భూక్యా వీరభద్రం
నకిరేకల్ -  చినవెంకులు
ఇబ్రహీంపట్నం -  యాదయ్య
ముషీరాబాద్  - దశరథ్
 జనగామ - కనకా రెడ్డి 
పటాన్​చెరు  -  మల్లికార్జున్
 భువనగిరి -  నర్సింహ