
హైదరాబాద్, వెలుగు: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సర్వే నెం.255 ప్రభుత్వ భూమిలో పేదలు వేసుకున్న గుడిసెలకు పట్టాలు ఇచ్చి, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని సీపీ ఎం కోరింది. ఈ మేరకు గురువారం సీపీఎం రాష్ట్ర ప్రతినిధుల బృందం సీఎం రేవంత్ రెడ్డి కలిసి వినతిపత్రం అందజేసింది. ఈ సందర్భంగా సీపీఎం నేతలు మాట్లాడుతూ.. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న సర్వే నెం.255లోని 220 ఎకరాల ప్రభుత్వ భూమిలో 150 ఎకరాల భూమిని ఇందిరాగాంధీ హయాంలో పేద రైతులకు పంచారని తెలి పారు. అగ్రిమెంటు పట్టాలు కూడా ఇచ్చారని వెల్లడించారు.