
- సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్‌పై రూ.50 పెంచి పేద, మధ్యతరగతి ప్రజలపై భారం మోపడం దారుణమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఒక ప్రకటనలో మండిపడ్డారు. వెంటనే గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గడంతో వినియోగదారులకు గ్యాస్ సిలిండర్ రేటు తగ్గించి ఆ ఫలితాలు అందించాలని పేర్కొన్నారు. ఉజ్వల స్కీమ్ లబ్ధిదారులు, సాధారణ వినియోగదారులతో పాటు మహాలక్ష్మి స్కీం అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వంపై భారం పడుతుందని తెలిపారు.
నిత్యవసర సరుకుల ధరలు నియంత్రిస్తామని చెప్పిన కేంద్రం.. అన్ని రకాల సరుకుల రేట్లు పెంచిందని ఫైర్ అయ్యారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్యాస్ సిలిండర్ ధరలు పెంచడంతో పాటు సబ్సిడీని తగ్గించుకుంటూ వచ్చిందని విమర్శించారు. కార్పొరేట్ కంపెనీలకు రూ.లక్షల కోట్లు రాయితీలు ఇస్తూ వినియోగదారులపై ఏడాదికి రూ.400 కోట్ల భారం మోపుతున్నదని తెలిపారు.