హనుమకొండకు సీపీఎం జాతీయ నేతల రాక

  • ఇయ్యాల్టి నుంచి 3 రోజులపాటు సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు

హనుమకొండ జిల్లా: సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశాలు ఇవాళ్టి నుంచి 3 రోజులపాటు జరగనున్నాయి. హనుమకొండలో జరిగే సమావేశాలకు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్ బ్యూరో సభ్యులు విజయ రాఘవన్, బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీర భద్రం హాజరవుతున్నారు. రాష్ట్రంలో ఎన్నికల వేడి పెరిగిన నేపథ్యంలో సీపీఎం క్యాడర్ లో జవసత్వాలు నింపేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పట్టున్న స్థానాల్లో గెలిచి రాష్ట్రంలో తన ఉనికిని చాటుకోవాలన్న పట్టుదలతో నాయకులు సన్నాహాలు చేస్తున్నారు. కార్యకర్తల్తో స్థబ్దత తొలగించి ఈ సమావేశాల ద్వారా ఎన్నికల సమరానికి సమరశంఖం పూరించే రీతీలో కార్యాచరణ ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది.