![మిర్చికి రూ.25 వేల కనీస మద్దతు ధర ఇవ్వాలి:సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ](https://static.v6velugu.com/uploads/2025/02/cpm-state-secretary-demanded-that-minimum-support-price-of-rs-25-000-should-be-given-for-chilli_SjOXUT8f7l.jpg)
- సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్
హైదరాబాద్, వెలుగు: మిర్చికి కనీస మద్దతు ధర రూ.25 వేల చొప్పున ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు. క్వింటాల్‌కు రూ.25 వేలు ఉండాల్సిన మిర్చి రేట్లను వ్యాపారులు రూ.12 వేలకు తగ్గించి కొంటున్నారని, ఫలితంగా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని శుక్రవారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు.
ఖమ్మంలో ఇద్దరు రైతులు ఆత్మహత్యలు చేసుకోగా.. ఒక రైతు గుండెపోటుతో మరణించారన్నారు. మిర్చి బోర్డును ఏర్పాటు చేసి మద్దతు ధర నిర్ణయించేలా కేంద్రంపై ఒత్తిడి చేయాలన్నారు. మార్క్‌ఫెడ్ ద్వారా మిర్చి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు.
ఎకరాకు 30 క్వింటాళ్ల మిర్చి దిగుబడి రావాల్సి ఉండగా క్రిమి, కీటకాల వల్ల 12 క్వింటాళ్లకు తగ్గిందన్నారు. ఎకరాకు రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెడితే ఆ డబ్బులు కూడా రావడం లేదన్నారు. దీనిపై రాష్ట్ర మార్కెటింగ్ శాఖ జోక్యం చేసుకొవాలని కోరారు.