
హైదరాబాద్, వెలుగు : నాగర్ కర్నూల్ జిల్లాలోని దోమలపెంట సమీపంలో ఉన్న శ్రీశైలం ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ఘటనపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ స్పందించారు. టెన్నెల్ పైభాగం కూలడంతో ఎనిమిది మంది చిక్కుకోడంపై విచారణ జరిపించాలని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. వారం రోజులుగా నీరు లీకేజీ అవుతున్నా.. అప్రమత్తంగా ఉండాల్సిన ప్రభుత్వం టెన్నెల్ పనుల్లో ఎలాంటి రక్షణ చర్యలు లేకుండానే పనులు చేపట్టిందని ఆరోపించారు.
ఈ ఘటన పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ఎక్స్ గ్రేషియాతోపాటు వారిని అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. మెరుగైన వైద్యం అందించాలని, టన్నెల్లో చిక్కుకున్న వారిందరినీ సురక్షితంగా బయటకు తీసుకురావడానికి చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని జాన్ వెస్లీ డిమాండ్ చేశారు.