
- అసెంబ్లీ తీర్మానాన్ని ఆహ్వానిస్తున్నం
హైదరాబాద్, వెలుగు: డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయడాన్ని ఆహ్వానిస్తున్నామని, కేంద్రం నిర్ణయంతో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్రంగా నష్టం జరుగుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. శనివారం హైదరాబాద్ లోని సీపీఎం రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రామోజీ ఫిల్మ్ సిటీలో 700 కుటుంబాలకు 2007లో ఇండ్ల స్థలాల నిర్మాణానికి నాటి ప్రభుత్వం పట్టాలిచ్చిందన్నారు.
అయితే ఫిల్మ్ సిటీ యాజమాన్యం చుట్టూ పహరీ కట్టి, రోడ్లను ఆక్రమించి పేదలను ఆ భూముల్లోకి రానివ్వడం లేదన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీ యాజమాన్యం 360 ఎకరాలు ఆక్రమించిందని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తాము బలంగా ఉన్నచోట ఒంటరిగా పోటీ చేస్తామన్నారు.