మునుగోడు ఉపఎన్నిక : వారం రోజుల్లో మా నిర్ణయం ప్రకటిస్తాం

మునుగోడులో బీజేపీని ఓడించే పార్టీకి మద్దతు ఇస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. మునుగోడు ఉపఎన్నికలో ఏ పార్టీకి మద్ధతు ఇస్తామన్నది వారం రోజుల్లో ప్రకటిస్తామన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన సొంత లాభం కోసమే బీజేపీలో చేరబోతున్నారని, ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే బీజేపీ కొనుగోలు రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు. 

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. మునుగోడు ఉపఎన్నికలో గెలిచి సత్తా చాటాలని అధికార పార్టీ టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ భావిస్తున్నాయి. ఇందులో భాగంగానే అన్ని పార్టీలు ఇప్పుడు మునుగోడు నియోజకవర్గంపై ప్రత్యేకంగా ఫోకస్ చేశాయి. మునుగోడులో ఈ నెల 20న కేసీఆర్ సభ ఉండగా.. 21న అమిత్ షా సభ ఉంది. ఈ సభలోనే రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరనున్నారు.