- సీఎం రేవంత్‌రెడ్డికి తమ్మినేని వీరభద్రం లేఖ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణతోపాటు ప్రజల భద్రతకు కూడా ప్రాధాన్యమివ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. బుధవారం ఆయన మూసీ సుందరీకరణ సమస్యలు, పరిష్కారాలపై సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. మూసీ సుందరీకరణ పేరుతో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మూసీ రివర్‌బెడ్ ఏరియాలో ఇండ్లు కట్టుకుని నివాసముంటున్న పేద, మధ్యతరగతి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎప్పుడు బుల్డోజర్లు వచ్చి కూలగొడతాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారన్నారు. మూసీలో ప్రధాన సమస్య కాలుష్యమని పేర్కొన్నారు. మందులు, రసాయనాల పరిశ్రమలకు సంబంధించిన వ్యర్థాలు, జంట నగరాల మురుగు నీరు అందులో కలవడం వల్ల కాలుష్యం పెరుగుతున్నదన్నారు.