షరతులు లేకుండా రుణమాఫీ చేయాలె: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

షరతులు లేకుండా రుణమాఫీ చేయాలె: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

హైదరాబాద్:గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగా కాకుండా..ఆక్రమణలు మొత్తం కూల్చివేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. హైడ్రా ఆక్రమణలను కూల్చి వేయడం మంచి నిర్ణయం. భూమాత పోర్టల్​పై రైతులతో చర్చపెట్టాలి. రుణమాఫీని పక్కదోవ పట్టించటానికి మంత్రులు ప్రయత్నం చేస్తున్నారు. రుణమాఫీకి రేషన్​ కార్డు అవసరం లేదని సీఎం చెప్పారు. కానీ రుణమాఫీ కావాలంటే అధికారులు రేషన్​కార్డు అడుగుతున్నారు. 

ఎం రేవంత్​ పర్యటనలు ఉంటే సీపీఎం నేతలను ముందస్తుగా ఎందుకు  అరెస్ట్ చేస్తారు..?  ఎలాంటి షరతులు లేకుండా రూ.2 లక్షల  రుణమాఫీ చేయాలి.  రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్​ చేస్తూ  సీపీఎం ఆధ్వర్యంలో  ఈ నెల 29న ఎమ్మార్వో ఆఫీస్​ ల ముందు ధర్నాలు నిర్వహిస్తాం”  అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు.