
మధిర, వెలుగు: సమగ్ర కుటుంబ సర్వేను పక్కాగా చేపట్టాలని ఆర్డీవో జీ.నర్సింహారావు, సీపీవో ఎ.శ్రీనివాస్అధికారులకు సూచించారు. మంగళవారం మధిర మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డులో, మధిర మండలంలోని సిరిపురం గ్రామంలో డోర్ టు డోర్ లిస్టింగ్ సర్వే పనులను వారు పరిశీలించి పలు సూచనలు చేశారు. మధిర మండలానికి ఆర్డీవో హోదాలో మొదటి సారి వచ్చిన రెవెన్యూ డివిజనల్ అధికారి జి.నరసింహారావును తహసీల్దార్ రాంబాబు, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, ఎంపీవో కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.